-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టర్ ఛాంబర్ నుంచి ఏలూరు , కాకినాడ జెడ్పీ సి ఈ వో లతో పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, పిఎం ఆదర్శ యోజన కింద షెడ్యూల్ కులాల నివాసిత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్, రూరల్ వాటర్ సప్లై సంస్థ ఆధ్వర్యంలో ప్రతిపాదిత పనులు మార్చి 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా లకు చెందిన నిధులను విడుదల చెయ్యడం జరిగిందన్నారు. సుమారు రూ. 5 కోట్ల నిధులు తో 100 పనులు పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. సిసి రోడ్లు, డ్రెయిన్స్ , ఎస్ డబ్ల్యూ పీసీ షేడ్స్ , పైపు లైన్లు, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేశామని, వాటికి సంబంధించిన డ్రెయిన్స్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. మార్చి 31 లోగా నిధులను ఖర్చు చేయాలని, వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి డివిజన్ రాజానగరం, సీతానగరం , కోరుకొండ , కొవ్వూరు డివిజన్ లో దేవరపల్లి, గోపాలపురం , నల్లజర్ల , తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు చెందిన వాటిపై మండలాలు వారీగా సమీక్షించారు.
ఈ జూమ్ సమావేశంలో జెడ్పీ సీఈవో లు సుబ్బారావు (ఏలూరు) లక్ష్మణ కుమార్ (కాకినాడ), డిడి సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్మెస్ శోభారాణి, ఆర్డబ్ల్యు ఎస్ ఎస్ ఈ బివి గిరి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News