Breaking News

మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవర, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మి వివిధ చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు, ఏ.పి.ఈ.డి.సి.ఎల్ సంస్థ ప్రతినిధులు, వివిధ బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదులతో సోమవారం స్థానిక డి ఎల్ ఎస్ ఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. మార్చ్ 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఆయా సంస్థల సివిల్ మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అంద జేయాలన్నారు. రాజీ పడదగిన అన్ని ఇతర కేసులను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *