Breaking News

నిర్మాణ వ్యర్ధాల తొలగింపు కు ట్రాక్టర్ యజమానులతో అవగాహన ఒప్పందం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిర్మాణ వ్యర్ధాలు సర్కిల్ పరిధిలో ఎప్పటికప్పుడు తొలగాలన్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, ప్రైవేట్ ట్రాక్టర్ యజమానులతో నిర్మాణ వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించే విధంగా అవగాహన ఒప్పందం (MoU) కొరకు మంగళవారం ఉదయం తమ తమ సర్కిల్ కార్యాలయాల్లో సమావేశం నిర్వహించారు. సర్కిల్ పరిధిలోగల పబ్లిక్ వీధుల్లో నిలువ ఉన్న భవన నిర్మాణ వ్యర్ధ పదార్థాలను తొలగించుటకు గాను రవాణా ట్రాక్టర్ యజమానులకు నగరపాలక సంస్థ మధ్య అవగాహన ఒప్పందం ద్వారా సర్కిల్ పరిధిలో గల అన్ని వీధుల యందు ఉన్న భవన నిర్మాణ వ్యర్థ పదార్థాలను నగరపాలక సంస్థ సిబ్బంది వారి సమాచారం మేరకు వాటిని తొలగించుటకు వారి సమక్షంలో భవన యజమానులతో తొలగింపునకు సహితుకమైన చార్జ్ వసూలు పై ట్రాక్టర్ ద్వారా తొలగించవలెనని ఈ సమావేశంలో చర్చించారు. ఈ అవగాహన ఒప్పందంలో ఉన్న షరతుల ప్రకారం ఉదయం 6 గంటల నుండి ట్రాక్టర్ కార్మికులతో సహా వాహనము అందుబాటులో ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే ట్రాక్టర్ తో అనుమతించవలెనని, తొలగించిన వ్యర్థాలను నిర్దేశించిన ప్రాంతము లో కాకుండా కాలువలో కానీ శివారు ప్రాంతపు రోడ్డు లో కానీ వెయ్యరాదని, ఒకవేళ వేస్తే ఐదు వేల రూపాయలు జరినామా విధించబడనని, నోడల్ ఆఫీసర్ తెలియజేసిన 24 గంటల్లో సిఎన్డి వేస్టుని తొలగించాలని, మొదలగు విషయాలపై షరతులు ఉన్నాయి. ఈ సమావేశంలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్ర బోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, రవాణా ట్రాక్టర్ల యజమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *