Breaking News

మహాశివరాత్రి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదుని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని టెలి కాన్ఫరెన్స్ లో శాఖాధిపతులతో, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ రోజున వచ్చే భక్తులకు ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు, తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక రూమలు, కల్పించి నిరంతరం పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో నిర్వహించాలని, డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ లోపాలు ఉన్నా వెనువెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులను ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో శాఖధిపతులు ప్రజారోగ్య సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *