-సున్నా పేదరికం పి4 సర్వే వేగవంతం చేయాలి
-జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలి అని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) పై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో స్వయంగా వెళ్లి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. ఎండార్స్మెంట్లను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని తెలిపారు. సరైన పరిష్కారo చూపగలిగితే రీ ఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. పదే పదే రీ ఓపెన్ అవుతున్నా కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జిదారులు వారి సమస్యకు పరిష్కార దిశగా గ్రీవెన్స్ రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీ దారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానoగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారo చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను ఓపెన్ చేసుకోవాలని తెలిపారు.
సున్నా పేదరికం లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి పి 4 సర్వే పక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఎంపిడిఓ లు, మున్సిపల్ కమీషనర్ లు పి4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ , పార్ట్నర్షిప్) పాలసీ కి సంబందించి వెనుకబడిన గ్రామాలలో సర్వే ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరిత గతిన పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలోని 0, 6 సంవత్సరపు పిల్లల ఆధార్ నమోదు ప్రక్రియను సంబంధిత మండలాలలో వేగవంతం చేయాలని తెలిపారు. సిడిపిఓలు పిల్లల ఆధార్ నమోదు ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు సేవా కేంద్రం లో గ్రామ వ్యవసాయ సహాయకులు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ పోర్టల్ నందు రైతు నమోదు కార్యక్రమ ప్రక్రియను 95 శాతం పూర్తయిందని, మిగిలిన 5 శాతం ఐడి క్రియేషన్ పూర్తి చేయాలని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డుగా మార్చబడిందని ఇందులో నమోదు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందే సదుపాయాన్ని కల్పించిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News