Breaking News

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పన

-ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 వ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ లతో కలిసి పట్టు వస్త్రాలను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  సమర్పించారు. అనంతరం మంత్రి ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని స్వామి వారిని జ్ఞాన ప్రసునాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, శ్రీకాళహస్తి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామారావు, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, శ్రీకాళహస్తి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి బాపిరెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *