Breaking News

హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన/శిక్షణ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్‌సెక్స్ మరియు అలైంగిక విధానం లో జీవనం గడిపే వ్యక్తులకు చెందిన మనో భావాలని గుర్తించి సుప్రీంకోర్టు న్యాయపరమైన హక్కును పొందేందుకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో LGBTQIA + కమ్యూనిటీ సభ్యుల హక్కులు మరియు హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన/శిక్షణ కార్యక్రమం వారి హక్కులను హరించడంలో క్వీర్ కమ్యూనిటీకి అవసరమైన సహాయం అందించడానికి , పారా లీగల్ పాత్ర పై శిక్షణ కార్యక్రమం కు జిల్లా ప్రథాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, స్వలింగ సంపర్కుల, ఇతర ట్రాన్స్ జెండర్ల , తదితరులకు రాజ్యాంగ బద్దంగా హక్కులు కలిగించకపోయిన సుప్రీం కోర్టు వారి మనోభావాలను గుర్తించి గౌరవించడం జరిగిందన్నారు. అటువంటి వారి విషయంలో సుప్రీం కోర్టు చూపిన పెద్ద మనస్సు దృష్ట్యా మనం కూడామానస వాచా కర్మణా విధి నిర్వహణలో భాగస్వామ్యం కావాలన్నారు. పారా లీగల్ వాలంటీర్లు విధి నిర్వహణలో వారి బాధ్యతలను గుర్తెరిగి పనిచేయాలని, ఈ శిక్షణా తరగతులు పూర్తీ స్థాయి లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. LGBTQIA పై సందేహలను నివృత్తి చెయ్యడం కోసం హైదరబాద్ నుంచి స్వచ్ఛంధ సంస్ధ ప్రతినిధులు హాజరవ్వడం పట్ల గంధం సునీత అభినందించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ న్యాయమూర్తి ఏ గాయత్రి, డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, సాది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పారా లీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *