శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి చేరుకున్న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి , దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.. తదనంతరం మంత్రి ఆనం స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తో కలిసి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమాభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు .
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ… శ్రీకాళహస్తి ఆలయం దేశవ్యాప్తంగా శివ భక్తులకు ఆధ్యాత్మికంగా కీలక కేంద్రంగా ఉన్నదని, ప్రభుత్వం తరఫున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడం, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది అని, భక్తులు మనోభావాలకు కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. రేపు మహా శివరాత్రి పర్వదినం కావడం తో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం తో ఏర్పాట్లు అదనంగా ఉండేలా చొరవ తీసుకోవాలని మంత్రి అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్ విషయం లో, ప్రత్యేక దర్శనం విషయం లో, వసతి సదుపాయాలు, పారిశుధ్య పనులు ఎప్పటికి అప్పుడు పర్యవేక్షణ చేయాలనీ అలాగే విధి నిర్వహణ కోసం వచ్చిన అధికారులు కూడా ఒకరి ఒకరు సహకరించుకుంటూ శాఖల మధ్య సమన్వయం తో కలిసి కట్టుగా పని చేసి ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, రెవిన్యూ డివిజన్ అధికారి భాను ప్రకాష్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News