Breaking News

27 వ తారీఖున స్థానిక ప్రజలకొరకు పూర్తి ఉచిత దర్శన సౌకర్యం

-విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ కనువిందు చేస్తుంది 
-దేవాదాయ మరియు ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రిమాట్లాడుతూ ….శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబిక సమేత కాళహస్తీశ్వర స్వామిని దర్శించి ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కాళహస్తి శాసనసభ్యులు చలో సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, దేవాదాయశాఖ కమిషనర్, ఈవో, కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ లాంఛనాలతో జరిగిందని, ఈ కార్యక్రమానికి ముందు రెవెన్యూ మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక శాసనసభ్యులతో కలిసి సమీక్షించుకోవడం జరిగిందని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పినరోజే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే దాదాపు 21వ తేది నుండి ఐదు రోజులు పాటు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. వారందరినీ కూడా అన్ని విధాల సమగ్రంగా పూర్తిస్థాయి సంపూర్ణంగా వారు స్వామివారి యొక్క దీవెనలు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తెలిపారు. ప్రతి భక్తుడికి ఆలయ పాలకవర్గం స్థానిక సభ్యులు నాయకులు నాయకత్వంలో లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో 50 రూపాయల క్యూ లైను ఉండేదని, ఇప్పుడు ఆ క్యూ లైన్ కూడా తీసివేయడం జరిగిందని, ఆ క్యూలన్నీ కూడా ఉచిత లైన్లు గా మార్చడం జరిగిందని తెలిపారు. సామాన్య ప్రజలకు ఎక్కువమందికి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. రేపు మహాశివరాత్రి లింగోద్భవం తర్వాత 27వ తారీఖున స్థానికులకు వచ్చే అందరు భక్తులకు ఉచిత దర్శనమే ఉండాలని అధికారులకు సూచించడం జరిగింది అన్నారు. 27 వ తారీఖున పూర్తి ఉచిత దర్శన సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఆలయ పరిసరాల్లో మరింత రోడ్డు విస్తరణ పనులు కానీ ఎక్కడెక్కడ ఏదైనా భవనాలు అడ్డు ఉంటే వాటిని తొలగించుటకు నిర్వహించిన సమీక్షలో వాటికి అయ్యే ఖర్చు కూడా దేవాదాయశాఖ నిధుల నుండి ఇస్తామని తెలిపారు. శివరాత్రి పూర్తి అయిన తర్వాత దేవాలయ మరింత విస్తృతంగా అభివృద్ధి చేయాలన్నారు.
ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రోడ్డు విస్తరణ పనులు, కాళహస్తి పట్టణంలో వీధి దీపాలు. డివైడర్ల మధ్యలో అలంకారప్రాయంగా తీర్చి దిద్దడం జరుగుతుందని, రాతి స్తంభాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని,
ఈరోజు ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చూస్తే ఎంతో శుభదాయకంగ ఉందన్నారు. విద్యుత్ దీపాలంకరణ కన్నుల పండుగగా కనిపిస్తుందన్నారు. ఇది ఎన్నడూ లేనంత శోభని చేకూర్చిందని జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం వీలైందని తెలిపారు. విద్యుత్ దీపాల క్రాంతి, పుష్పాలంకరణ తిరుమల శ్రీవారికి పుష్పాలంకరణ జరుగుతుందో అంతే స్థాయిలో శ్రీకాళహస్తిలో కూడా అలంకరించడం జరిగిందని తెలిపారు. ప్రజలలో ఆధ్యాత్మికతను పెంచాలి, ప్రజల కోరికలు నెరవేరాలని, ప్రజలందరూ బాగుండాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందని దీనికి అధికార యంత్రాంగం తోపాటు ఆలయ అర్చకులు నిబద్ధతతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. గత సంవత్సరం కంటే 30% అధికంగా భక్తులు వస్తారని అంచనాతో అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని అన్నారు. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన రాష్ట్ర ప్రజలకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని , మన రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని దేవుని కోరుతున్నానని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *