Breaking News

స‌మ‌స్యల‌ ప‌రిష్కారం కోసం కృషి చేసే నాయ‌కుడ్ని గెలిపించాలి : ఎంపి కేశినేని శివనాథ్

-ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి ఆల‌పాటి విజ‌యాన్ని కాంక్షిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం
-ఉపాధ్యాయుల‌తో స‌మావేశమైన ఎన్డీయే నాయ‌కులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడు నెలల క్రితం ప్ర‌జ‌లంద‌రీ ఓటు పవర్ తో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి ప‌ట్ట‌భ‌ధ్రులు ఓటు పవర్ చూపించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే నాయ‌కుల్ని కాకుండా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేసే ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఉపాద్యాయుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మంగ‌ళ‌వారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని విద్యాధ‌ర‌పురం అప్పాల‌స్వామి క్వారీ రోడ్ లో గ‌ల కె.సి హైస్కూల్ లోని ఉపాధ్యాయుల‌తో ఎంపి కేశినేని శివనాథ్ స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజాకి వేయాల‌ని కోరుతూ ఓటు ఏ విధంగా వేయాలో కూడా వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప్ర‌తి ప‌క్షంలో వున్న‌ప్పుడు స‌మ‌స్య‌ల‌పై పోరాడామ‌ని, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రజా ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు విజ్ఞతతో ఆలోచించి ఎన్ డి ఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఉపాద్యాయుల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా అండ‌గా నిల‌బ‌డి ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ఏడు నెల‌ల్లోనే రాష్ట్రాభివృద్దితో పాటు అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాన్ని కూడా ప‌రుగులు పెట్టిస్తున్నాడన్నారు..

యువ‌త భ‌విష్య‌త్తు అమ‌రావ‌తిరాజ‌ధాని పై ఆధారప‌డి వుందని అందుకోసం సీఎం చంద్ర‌బాబు నిరంతరం శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. పేదరికం లేని స‌మాజం త‌యారు చేయాల‌నేది సీఎం ఆశయమ‌ని ఇందుకోసం రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబంలో ఒక‌ర్ని ఖ‌చ్చితంగా ఎంట‌ర్ ప్రెన్యూర్ చేసే విధంగా ముందుకు వెళుతున్నార‌న్నారు. అలాగే గ‌త‌ ప్రభుత్వం హాయంలో విద్యావవ్యస్థను సర్వనాశనం చేశారని, ఉపాధ్యాయులందరూ కలిసి 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి తగిన బుద్ది చెప్పారన్నారు. అదే విధంగా ఎన్డీయే కూట‌మి బ‌ల‌ప‌రిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించుకుని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అత్యంత సన్నిహితంగా ఉంటారని అందువల్ల ఉపాధ్యాయుల సమస్యలను వారికి వివరించడమే కాకుండా పరిష్కరించగలరని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటుగా యువత ప్రధాన సమస్య అయిన నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించేలా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కృషి చేస్తారని చెప్పారు.

టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న, టిడిపి రాష్ట్ర‌ అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం లో ప్రతి ఒక్కరూ భయంతో బ్రతికారని, నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ప్ర‌జా ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌లు గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా ప‌డుకుంటున్నార‌న్నారు. అలాంటి నాయకుడ్ని బలపర్చి ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాడేందుకు కృషి చేసిన విద్యావేత్త మేధావి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, కే.సి హైస్కూల్ ప్రిన్సిపల్ హర్షవర్ధన్, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా , , టిడిపి రాష్ట్ర తెలుగు మ‌హిళ ఉపాధ్య‌క్షురాలు ఆషా,ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సోలంకి రాజు,క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ యెదుపాటి రామయ్య‌, కార్పొరేట‌ర్ ఉమ్మ‌డి చంటి, టిడిపి కార్పొరేట‌ర్ ర‌త్న‌కుమారి, బిజెపి కార్పొరేట‌ర్ గుడివాడ న‌రేంద్ర , టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు శివ‌శ‌ర్మ , 44వ డివిజ‌న్ అధ్య‌క్షుడు బొడ్డుప‌ల్లి శ్రీనివాస్, 39వ డివిజ‌న్ అధ్య‌క్షుడు రేగ‌ళ్ల ల‌క్ష్మ‌ణ‌రావు, డివిజ‌న్ అధ్య‌క్షులు ముదిరాజ్ శివాజీ, సుబ్బ‌య్య‌, పేరం స‌త్య‌నారాయ‌ణ‌, ప‌త్తి నాగేశ్వ‌ర‌రావు, కొనికి కొండ‌య్య‌, , ప్ర‌స‌న్న‌ల‌క్ష్మీ, సుఖాసి స‌రిత‌, ఎస్.కె క‌రీముల్లా, టిడిపి నాయ‌కులు మైల‌వ‌ర‌పు కృష్ణ, మైల‌వ‌ర‌పు దుర్గరావు, గంగ‌వ‌ర‌పు ముర‌ళీ, రేగా కాంతారావు ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *