విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడీ శోధనతో ఆరోగ్య సమస్యలు నిర్ధారణ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని యోగ శక్తి చికిత్స రూపకర్త మరియు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మనలో నాడీ అనేది సృష్టికర్త ద్వారా మనలో ఏర్పాటు చేయబడి మన 12 అవయవాల పనితీరు లో హెచ్చుతగ్గులు కనిపెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే విధానం భారతదేశంలో వేల సంవత్సరాలుగా వాడబడినది అని దీనిని యోగ, ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యంలో వాడుతున్నారని, చెప్పారు. నాడీ ద్వారా ప్రాణశక్తి స్థాయిని గుర్తించవచ్చునని, ఉన్న ఆరోగ్య సమస్యలను, రాబోయే సమస్యలను గుర్తించి ఆరోగ్యం, ఆనందం మరియు పూర్ణ ఆయుష్షులు కలిగేలాగా ప్రాణ శక్తి పెరిగేలాగా చేయటానికి నాడీ శోధన ఉపయోగం అని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈనెల 26 తేదీ బుదవారం ఉదయం 10 నుండి 27 వ తేది వరకు అశోక్ నగర్ కానూరు లో గల ఇండియన్ హోం కేంద్ర కార్యాలయం వద్ద నాడీ శోదన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన గలవారు సెల్ నెంబర్ 9 0 0 0 3 4 7 3 6 9 కు తేదీ 26 ఉదయం 10 గంటల లోపు తెలిపి పేరు నమోదు చేసుకోవలసినదిగా డాక్టర్ మాకాల సత్యనారాయణ ఒక ప్రకటన ద్వారా కోరారు.
Prajavartha Online Telugu News