– పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. పోలీసు సిబ్బంది 24X7 అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ గోదామును ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు.
తనిఖీ ప్రక్రియలో కలెక్టర్ వెంట డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News