Breaking News

ఎమ్మెల్సీ పోలింగ్ రోజున స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్‌

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వీలుగా ఓటు హ‌క్కు ఉన్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న దృష్ట్యా ప్రైవేటు, వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక, ఇత‌ర సంస్థ‌లు కూడా ఓట‌రుగా న‌మోదు చేసుకున్న త‌మ ఉద్యోగులు, కార్మికులు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు విధుల స‌మ‌యాన్ని త‌గ్గించ‌డం లేదా షిఫ్ట్‌ల‌ను స‌ర్దుబాటు చేయ‌డం వంటి వెసులుబాట్లు క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *