-ఘనంగా ప్రారంభమైన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం అని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ కమీషనర్ మరియు స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్ కె శారదదేవి ఐ ఏ ఎస్ అన్నారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో మంగళవారం నుండి 5 రోజుల పాటు నందు జరుగు అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం 2వ దశ లో భాగంగా గుంటూరు నెహ్రూయువకేంద్ర అద్వర్యం లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎన్ ఎస్ ఎస్ భవన్ కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో ఒడిశా లోని 5 జిల్లాలైన మయూర్భంజ్, ఫుల్బాని, కలహంది, గంజాం మరియు నబరంగపూర్ జిల్లాల నుంచి మొత్తం 26 మంది యువతి యువకులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా శారదదేవి ఐ ఏ ఎస్ మాట్లాడుతూ మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతంగా కొనసాగించడం ఇటువంటి యువ సమ్మేళనాల ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే గంగాధరావు మాట్లాడుతూ యువ అంతరాష్ట్ర సమ్మేళనాలు ద్వారా వివిధ రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు మరియు అభ్యాసాల పరిజ్ఞానం రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు బంధానికి దారితీస్తుంది అని తద్వారా భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేస్తుంది అని అన్నారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ నెహ్రూ యువకేంద్రాల ద్వారా రాష్ట్రాల మధ్య సంప్రదాయాలు, సంస్కృతి మరియు విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించడానికి, 2024-25 సంవత్సరంలో 60 అంతర్ రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కె రత్న షీలా మణి, రెక్టర్, ప్రొఫెసర్ దివ్యతేజో మూర్తి, కోఆర్డినేటర్, ఎన్ ఎస్ ఎస్, ప్రొఫెసర్ ఆర్ వి ఎస్ ఎస్ ఎన్ రవి కుమార్ గౌరవ అతిధులగా హాజరై ప్రసంగించగా, కార్యక్రమం లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో యువత అలరించారు.
Prajavartha Online Telugu News