Breaking News

మహాభక్తి ఛానల్ తెలుగుప్రజల ముంగిళ్లలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తుంది

-మ‌హాభ‌క్తి ఛాన‌ల్ ప్రారంభోత్స కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన‌ అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో మహాభక్తి ఛానల్ ప్రారంభం కావ‌టం ఎంతో ఆనందంగా వుంది. మహాభక్తి ఛానల్ తెలుగుప్రజల ముంగిళ్లలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తుందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. మ‌హా న్యూస్ ఛానల్ అధినేత మారెళ్ల వంశీ ఆధ్వ‌ర్యంలో మహాభక్తి ఛానల్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆల‌య మైదానంలో జ‌రిగింది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ మారెళ్ల వంశీ కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌హాభ‌క్తి ఛాన‌ల్ ప్ర‌జ‌ల్లో ఆధ్యాత్మిక చింతన పెంచి, మనిషి తనలోని ఆత్మశక్తిని గ్రహించి సమాజహితం, రాష్ట్ర పురోగతికోసం పాటుపడేందుకు కృషి చేయాల‌ని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *