Breaking News

తిరుపతి లో జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి లోని నాక్ ట్రైనింగ్ సెంటర్ నందు రేపు(28-02-2025) అనగా శుక్రవారం జాబ్ మేళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని నాక్ ట్రైనింగ్ సెంటర్ ( National Academy of Construction ,Tirupati) నందు 28-02- 2025 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును.

జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: National Academy of Construction(NAC),
Opp:S.V Medical College,Near Vivekananda Circle,
Alipiri Main Road,Tirupati,,Tirupati Dist.

ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, న్యూ ఆపర్చునిటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.

విద్యార్హతలు: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో పాటు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని కచ్చితంగా అడ్మిట్ కార్డు తో జాబ్ మేళాకు హాజరవ్వవలెను అని ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తిరుపతి జిల్లా వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/

మరిన్ని వివరములకు 9703437472,9988853335 మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.

గమనిక: జాబ్ మేళాకు (ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *