-ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా నలుమూలల నుండి పెద్దఎత్తున భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు
శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6 వ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా బుధవారం జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు దర్శించుకున్నారు.
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు ఇంద్రవిమానం చప్పర వాహనంపై కొలువు తీరగా విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎంఎల్ఏ బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్, సినీ ప్రముఖులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదమంత్రోచ్చారణతో వేద పండితులు ఆశీర్వదించారు..
సాయంత్రం జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదమంత్రోచ్చారణతో వేద పండితులు ఆశీర్వదించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. వారితో పాటు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీ కాళహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి, సేవా కమిటీ మెంబర్ గంగినేని చెంచయ్య నాయుడు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు ప్రజాప్రతినిధులు తదితరులు స్వామి వారిని, జ్ఞాన ప్రసునాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులకు పెద్ద పీట వేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యం కల్పించి, భక్తులకు భోజన సౌకర్యం, క్యూ లైన్ల నందు త్రాగు నీటి బాటిల్ సౌకర్యం, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాల కల్పన చేసి భక్తి శ్రద్ధలతో శివయ్యను దర్శించుకునేలా చేసిన చక్కని ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Prajavartha Online Telugu News