అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సూపర్ సిక్స్ హామీలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. అన్ని శాఖలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించారని చెప్పారు. ప్రధానంగా ఇండస్ట్రీయల్ డిపార్ట్‌మెంట్‌కు రూ.3,156 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం సంక్షేమం అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం దిశగా ముందుకు తీసుకువెళుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేయడంతోపాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో సీఎం చంద్రబాబు దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు.
Prajavartha Online Telugu News