-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టాలని, అందుకు తగ్గట్టుగా వేసవి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. అందు తగ్గట్టుగా జిల్లాల వారీగా పటిష్టమైన చర్యలను చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం సి.ఎస్. సమావేశ మందిరం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా, నీటి ద్వారా సంభవించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో అనుసరించాల్సిన విధి విధానాలు, సానుకూల ప్రజా అనగాహన మరియు ఎం.ఎస్.ఎమ్.ఇ. పార్కుల సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్చి నుండి జూన్ వరకూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి త్రాగునీటిన సమస్య తలెత్తకుండా అన్ని జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ముందుస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్యలు తీవ్రంగా తలెత్తేందుకు అవకాశం ఉండే గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై ముందుగానే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది అన్ని జలాశయాలు నీటితో కళకళలాడు తున్నాయని, భూగర్బ జలాలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఎటు వంటి ఆందోళన చెందాల్సిన పనిచేలేదని, అయితే ఆయా నీటి మట్టాలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలన్నారు. ఏ మాత్రమ త్రాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నా ముందుగానే స్పందించి ఆయా ప్రాంతాలకు సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే విధంగా జిల్లా యంత్రాగం సిద్దంగా ఉండాలన్నారు. ఆర్.డబ్ల్యు.ఎస్., పట్టణ స్థానిక సంస్థలు, పురపాల సంఘాలు మరియు కార్పొరేషన్ పరిధిల్లోని అన్ని బోరు బావులు, చేతిపంపులు, గ్రామీణ నీటి సరఫరా పథకాలు, ప్రజానీటి సరఫరా పథకాలు అన్ని సక్రమంగా పనిచేసేలే చూడాలని, వాటి మరమత్తులు వెంటనే చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు పర్చాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన త్రాగునీటిని పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా వాటర్ ట్యాంకర్ వాహనాలను ముందుగానే బాడుగికి తీసుకొని సిద్దింగా ఉంచుకోవాలన్నారు. ఇప్పటికే కొనసాగుచున్న క్రాష్ ఇన్స్పెష్కన్ ప్రోగ్రామ్ ను సాద్యమైనంత త్వరగా పూర్తి చేసి వేసవి ప్రణాళికలను తగిన అంచనాలతో రూపొందించి ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. నీటి వనరులు ఏమాత్రము కలుషిత కాకుండా ముందుగానే క్లోరినేట్ చేయాలని, కలుషిత త్రాగునీటి వల్ల వ్యాధుల ప్రభలే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గట్టుగా వైద్య సేవలు అందజేసే విధంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
ఫించన్ల పంపిణీలో ఎస్.ఓ.పి.ని తప్పని సరిగా పాటించాలి….
ఎస్.ఓ.పి. ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణినీ చేయాలని, ఫించన్ల పంపిణీలో ఎటువంటి పోటీతత్వాన్ని ప్రదర్శించకుండా, ఉదయాన్నే ఫించనుదార్లను ఇబ్బంది పెట్టకుండా ఎస్.ఓ.పి. ప్రకారం ఫించన్లు పంపిణీ చేయించాలని జిల్లా కలక్టర్లు ఆయన ఆదేశించారు. మార్చి 1 తేదీ శనివారం ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకూ ఫించన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మిగిలిన ఫించన్లను 3 వ తేదీన పంపిణీ చేయాలన్నారు. ఫించన్లను పంపిణీ చేసేటప్పుడు ఫించనుదార్లుతో ఎంతో గౌరవ ప్రధంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి ఎటు వంటి చెడ్డ పేరు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సానుకూల ప్రజా అనగాహన తీవ్రమైన చర్యలు చేపట్టేందుకు కాదు….
సానుకూల ప్రజా అనగాహన (Positive Public Perception) కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలు, కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించే ఆ సమాచారాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేయడం జరుగుచున్నదన్నారు. అధికారులు, సిబ్బంది తప్పులను గుర్తించేందుకు, వారిపై తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు ఇది ఉద్దేసింపబడినది కాదని, ప్రజాభిప్రాయం ఆధారంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమల్లోని లోటు పాట్లను సవరించుకునేందుకే ఇది ఉద్దేశింపబడిందన్నారు. కాబట్టి, ప్రజాభిప్రాయం ప్రకారం పథకాలను అమలుపర్చే తీరును అధికారులు, సిబ్బంది క్రమీణా అలవర్చుకోవాలని ఆయన కోవాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరుతేవాలని ఆయన కోరారు.
నియోజకవర్గాల వారీగా ఎం.ఎస్.ఎమ్.ఇ. పార్కులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములు గుర్తించేందకు ఇప్పటికే కొనుసాగుచున్న సర్వేను వేగవంతం చేసి పార్కుల ఏర్పాటు అవసరమైన భూములను సాద్యమైనంత త్వరగా గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్, రాష్ట్ర సమాచార మరియు సంబంధాలు డైరెక్టర్ హిమాన్షు శుక్లా, జన్కో ఎం.డి. చక్రధరబాబు తదితరులు ఈ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనగా, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఐటి & ఆర్.టి.జి.ఎస్. సెక్రటరీ కాటంనేని భాస్కర్, పరిశ్రమల శాఖ సెక్రటరీ ఎన్.యువరాజ్, ఎక్స్ అఫిషియో సెక్రటరీ మరియు సెర్పు సి.ఇ.ఓ. శ్రీమతి కరుణ మరియు అన్ని జిల్లాల కలెక్టర్లు వర్చ్యువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News