Breaking News

సర్కిల్ కార్యాలయాల్లో ఓపెన్ ఫోరం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి శుక్రవారం సర్కిల్ పరిధిలో గల సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించే ఓపెన్ ఫోరంను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం సర్కిల్ కార్యాలయాల్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు నిర్వహించారు. ఈ ఫోరం ద్వారా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం, బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్ లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సందేహాలను తీర్చారు. అంతేకాకుండా లయోలా కాలేజ్ రోడ్డు, బి ఆర్ పి రోడ్ వద్దగల ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం నిర్వహించే ఓపెన్ ఫారంలలో ఎల్ఆర్ఎస్, బి పి ఎస్, లో దరఖాస్తు చేసిన వారి సందేహాలను తీరుస్తున్నారని మరోవైపు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఫీల్డ్ లెవెల్లో నగరంలో ఉన్న ఆక్రమణలన్నీ కమిషనర్  ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని, పోల్స్ పైన, డివైడర్ల పైన, అనధికారంగా పెట్టిన బ్యానర్లు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని అన్నారు. నగరంలో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను ఒప్పందమున్న ట్రాక్టర్ల ద్వారా తొలగిస్తున్నామని ప్రతిరోజు దాదాపు 15 టన్నుల వరకు నిర్మాణ వ్యర్ధాలను తొలగిస్తూ ఎక్సెల్ ప్లాంట్ కు తరలిస్తున్నామని అన్నారు. ఈ శుక్రవారం నిర్వహించిన ఓపెన్ ఫోరంలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *