Breaking News

జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలకు 91 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

-కలెక్టర్ పి ప్రశాంతి

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ఇంటి వద్దకే లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, బెడ్ రీడెన్ , ప్రత్యేక అవసరాలు తదితర కారణాల వలన ప్రత్యేక అధికారుల సమక్షంలో లబ్ధిదారులు వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి పంచాయతీ పరిధిలో పలువురు బెడ్ రీడెన్ సామాజిక భద్రత పెన్షన్ దారులకు కలెక్టర్ పెన్షన్ నగదును అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల 35 వేల 344 మంది లబ్ధిదారులకు రూ.102 కోట్ల 4 లక్షల 19 వేల 500 లను పంపిణీకి సంబంధించి ఏర్పాట్లూ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకి 2,14,336 మందికి రూ.92 కోట్ల 65 లక్షల 28 వేల 500 లని నగదు చెల్లింపు జరగడం జరిగిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ల పంపిణీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *