Breaking News

త్రాగునీరు సరఫరా విధానం లో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న 10 , 15 రోజుల్లో వాతావరణ మార్పులు, వడగాలులు విచే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో త్రాగునీరు సరఫరా విధానం లో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా , డివిజన్ , మండల, గ్రామ స్థాయి అధికారులతో , సిబ్బంది తో వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా, పారిశుధ్యం నిర్వహణా, తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానం లో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఓ ఆర్ ఎస్ నిర్వహణా వ్యవస్థ తో వాటికీ అనుసంధానం చేపట్టే పనులన్నీ సమాంతరంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 180 హ్యాండ్ బోర్ పంపులని మరమ్మత్తులు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. పారిశుధ్య నిర్వహణా , సురక్షితమైన – స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్య సేవలు తగిన విధంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించుకోవడం ముఖ్యం అని కలక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.

వాతావరణ నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో రానున్న 10 , 15 రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కలక్టర్ తెలియ చేశారు.  కలుషిత నీటి ద్వారా సంక్రమించే నీటి ద్వారా సంక్రమించే కలరా వ్యాధి , శారీరకంగా సంక్రమించే కాలేయాన్ని ప్రభావితం చేసే వ్యాధి  అతిసారం,   టైఫాయిడ్, ఇన్ఫెక్షన్ బారిన ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శుద్ధమైన త్రాగునీరు సరఫరా చెయ్యాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఆర్డీవోలు, ఇతర జిల్లా , డివిజన్ మండల గ్రామ స్థాయిలోని అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *