లింగ నిర్దారణ పై వాణిజ్య ప్రకటనలు ఇస్తే శిక్ష తప్పదు

-లింగ నిర్దారణ చట్టం ప్రకారం శిక్షార్హం
– ట్రోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3365 ఫిర్యాదు చేయండి
-డి.ఎమ్.హెచ్.ఓ డా. కె. వెంకటేశ్వర రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో లింగ నిర్ధారణ పై ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వరాదు అని అలాంటి వాణిజ్య ప్రకటనలు కానీ ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రి వారు, లెబోరిటరీలు, స్కానింగ్ సెంటర్ లో వాణిజ్య ప్రకటన ఇస్తే పీసీ & పి ఎన్ డి టి చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొనబడునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె. వెంకటేశ్వరవు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కలెక్టర్ ఆదేశానుసారం ఈ యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయడం తో పాటు తప్పనిసరిగా జిల్లా అప్రాప్రియేట్ ఆధారిటీలో నమోదై సంబంధిత ఆసుపత్రులు చట్టంలోని సూచనాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలను ఉల్లగింస్తే నిర్వాహకులకు రూ.50 వేల నుంచి లక్ష వరకు జరిమానా అలాగే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విదించబడునని తెలియా చేశారు. జిల్లాలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3365 నెంబర్ కు తెలియజేయగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *