-జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళి మోహన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు స్థానిక తిరుపతి రవాణా శాఖ అధికారి కార్యాలయంలో టాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లు మరియు యజమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 14 రోజులుగా ఉబర్ సంస్థ కింద ఉన్న టాక్సీ క్యాబ్ డ్రైవర్లు వారు ఎదుర్కొన్న సమస్యల్ని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాహనమునకు తగినంత కిరాయి రావడంలేదని మరియు ముఖ్యంగా తిరుపతి విమానాశ్రయం లో పార్కింగ్ వసతి కల్పించడం లేదని తెలియచేశారు. ఒక్కోసారి ఉబర్ లో రవాణా వాహనం బుకింగ్ చేసుకున్నప్పటికీ స్వంత వాహనాలు కూడా ప్రయాణ నిమిత్తం ఉపయోగిస్తున్నారని తెలియచేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ మాట్లాడుతూ సొంత వాహనాలు టాక్సీగా వినియోగించే వాహదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అటువంటి వాహనాలను స్వాధీన పరచుకొనడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా మోటార్ వాహనాల తనిఖీ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లేని కారణంగా ఆ రాష్ట్రం నుండి పను చెల్లించకుండా వచ్చే వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతోందని వాటిని నియంత్రించడానికి నిత్యం తనిఖీలు చేపడుతున్నామని మోట వాహనాల అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోటోరోహణలో తనిఖీ అధికారి అతికానాజ్, పరిపాలనాధికారి విజయ ప్రశాంతి, ఉబర్ వాహన యాజమాన్య కమిటీ సభ్యులు రమేష్ రెడ్డిti, కరుణాకర్ రెడ్డి, మురళి, ఎల్లయ్య, మధుసూదన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News