అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో పోస్టల్ ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించడం మరియు జాతీయ ఏకత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా, పోస్టల్ శాఖ అనేక క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. వీటిలో, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఆకర్షించే క్రీడ Carrom.
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ముఖ్య పోస్టు మాస్టర్ జనరల్ కె. ప్రకాష్, I.Po.S. ఆధ్వర్యంలో 27వ ఆల్ ఇండియా పోస్టల్ Carrom టోర్నమెంట్ 2024-25 ను నిర్వహించడం గర్వకారణం. ఈ టోర్నమెంట్ 03.03.2025 నుండి 07.03.2025 వరకు తిరుపతి లోని మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం (స్మార్ట్ సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్), మున్సిపల్ ఆఫీస్ రోడ్, తిరుపతి – 517501 వద్ద నిర్వహించబడుతుంది. ముఖ్య పోస్టు మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్ ఈరోజు టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించనున్నారు.
ఈ టోర్నమెంట్‌లో పురుషులు మరియు మహిళల విభాగాల్లో 13 పోస్టల్ సర్కిల్ జట్లు భారత దేశపు నలుమూలల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి :
1. ఆంధ్రప్రదేశ్ 2. హర్యాణా 3. హిమాచల్ ప్రదేశ్ 4. జార్ఖండ్
5. కర్ణాటక 6. మహారాష్ట్ర 7. ఒడిశా 8. రాజస్థాన్
9. తమిళనాడు 10. తెలంగాణ 11. ఉత్తరప్రదేశ్ 12. పశ్చిమ బెంగాల్ 13. ఢిల్లీ
ప్రారంభోత్సవ కార్యక్రమం 03.03.2025 ఉదయం 9:30 గంటలకు, మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం (స్మార్ట్ సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్), తిరుపతి లో ప్రారంభమవుతుంది. ప్రొఫెసర్ Ch. అప్పారావు గారు, I/c Vice Chancellor, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, ఈ వేడుకకు గౌరవనీయ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ పోటీలు ఐదు రోజుల పాటు జరిగిన పిదప, టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం 07.03.2025 ఉదయం 11:00 గంటలకు, మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం (స్మార్ట్ సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్), తిరుపతి లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ పోస్టల్ ఉద్యోగుల మధ్య క్రీడాస్ఫూర్తిని, ఐక్యతను, మైత్రిని పెంపొందించే అద్భుతమైన వేదికగా నిలుస్తుంది.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News