గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, IAS అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ (DLAMC) సమావేశం శుక్రవారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఆధార్ సంబంధిత కార్యకలాపాలపై సమీక్ష జరిపి, పౌరులకు ఆధార్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబడింది. జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, IAS మాట్లాడుతూ, ఆధార్ సేవల వేగవంతమైన &సమర్థవంతమైన నిర్వహణకు జిల్లా స్థాయిలో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే, పౌరుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖలు కృషి చేయాలని సూచించారు.మరియు 0 నుండి 5 సంవత్సరములక పిల్లలకు సంబంధించి చిల్డ్రన్ ఎన్రోల్మెంట్, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (5 to 15 years & 15 to 17 years above) మరియు చిల్డ్రన్ బర్త్ సర్టిఫికెట్ సంబంధించిన అంశములపై సమీక్ష జరపడమైనది.
సదరు సమావేశమునకు గుంటూరు, తెనాలి డివిజనల్ అభివృద్ధి అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా విద్యాశాఖ అధికారి, DM&HO, మహిళా శిశు సంక్షేమ అధికారి,పోలీస్ శాఖ సిబ్బంది, గుంటూరు జిల్లా పోస్టు శాఖాధికారి, UIDAI ప్రతినిధి, జిల్లా కో-ఆర్డినేటర్,GSWS&జిల్లా కో-ఆర్డినేటర్, APT Online సహా DLAMC సభ్యులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News