-గోల్డ్ వర్క్ షాప్ ప్రారంభించిన ఎంపి కేశినేని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. నగరంలోని యువకులందరూ ఒక ఎంటర్ ప్రెన్యూర్ ఎదగాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని శివాలయం స్ట్రీట్ జెండా సందులో ఎస్.ఆర్.పి గోల్డ్ వర్క్స్ షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కు షాప్ యాజమాని సాయిరాజ్ పాటిల్ తో పాటు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా సిద్ధార్ధ కూడా పాల్గొన్నారు.
గోల్డ్ వర్క్ షాపులో ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత ఎంపి కేశినేని శివనాథ్ కి బంగార నగల తయారీకి అత్యాధునిక యంత్రాలు, నగల రిపేర్లకు వాడే లేజర్ షోల్డరింగ్ గురించి , బంగారం నాణ్యత పరీక్షించే లెటస్ట్ హాల్ మార్క్ మిషన్ గురించి ఎస్.ఆర్.పి గోల్డ్ వర్క్స్ ఎమ్.డి సాయి రాజ్ పాటిల్ వివరించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎమ్.ఎస్.ఎమ్.ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు. విజయవాడలో స్మాల్ స్కెల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించటానికి ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరిలతో కలిసి ప్రతి డివిజన్ లో అవగాహన సదస్సులు నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రతి పరిశ్రమలో మారుతున్న కాలానికి అనుగుణంగా లెటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటే వ్యాపారంలో అభివృద్ది సాధించవచ్చునన్నారు. విజయవాడకి ఇటువంటి పరిశ్రమలు ఎన్నో రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పిల్లా సుదర్శనం, డివిజన్ ప్రధాన కార్యదర్శి అమర మురళీ, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు, క్లస్టర్ ఇన్చర్జ్ పల్లెట్ల గంగాధర్, తెలుగు విద్యార్ధి యువత నాయకుడు దాడి మురళీ, 51వడివిజన్ అధ్యక్షుడు కుంచం దుర్గారావు, టిడిపి నాయకులు పీతా బుజ్జి,పట్నాల హరిబాబు, మహిళ నాయకురాలు మెండు జ్యోతి, అట్లూరి లక్ష్మీ లతోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News