Breaking News

గ్రామాల అభివృద్ధిపై తాటిగుమ్మి లో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ ఎన్ఐఆర్ డి పి ఆర్ లో శిక్షణ పొందిన విలేజ్ ఛాంపియన్స్ సోమవారం వికసిత్ పంచాయతీ కార్యక్రమం తాటిగుమ్మి గ్రామ పార్టీ అధ్యక్షులు గురునాధం ఆధ్వర్యంలో గ్రామాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలి అనే విషయం పై గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది అలాగే ఎన్ఐఆర్ డిపి కోఆర్డినేటర్ జీవీ నరసింహారావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కేశినేని చిన్ని ఫాండేషన్ స్థాపించి యువతకు మరియు నిరుద్యోగులు పలు రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు మహిళలకు వ్యక్తిగతంగా మరియు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా బలపడటం కోసం అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడం కోసం ఉన్న చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ద్వారా ఎలా అభివృద్ధి చెందాలి అని అలాగే ప్రభుత్వాల నుండి వ్యాపారాల కోసం ఉన్న వివిధ రకాల పథకాలు వాటి వివరాలు గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు గురునాధం,మాజీ సర్పంచ్ పల్లెకంటి రోశయ్య,బుక్ కీపర్ వెంకట్రావమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహారావు,పెనుమూరి బాబూరావు, బంకా రమేష్,గ్రామ మహిళలు, యువకులు విలేజ్ ఛాంపియన్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *