-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే కొలికపూడి ఆదేశాల పై ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవగాహన సదస్సు
-తిరువూరు 9వ,11వ,12వ,16వ వార్డుల్లో విస్తృత సమావేశాలు
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్త గా తయారై ఆర్థిక స్వాలంబన సాధించాలనే లక్ష్యంతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పని చేస్తున్నారు. ఇందుకోసం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ తీసుకుని మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలు గా ఏ విధంగా తయారు కావచ్చో సామాన్య జనాలకు అర్థమయ్యే విధంగా వార్డుల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాలపై ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ కో-ఆర్డినేటర్ మాదిగాని గురునాథం, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ కిట్టు బుధవారం తిరువూరు పట్టణంలోని 9వ,11వ,12వ,16వ వార్డుల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్లపై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చేపట్టాల్సిన విధి విధానాలను వాటి పై ప్రభుత్వం, బ్యాంకులు కలిగిస్తున్న ప్రోత్సాహకాలను తద్వారా చేకూరే సబ్సిడీలను పూర్తి వివరించారు. ముఖ్యంగా మహిళలకు 45 శాతం సబ్సిడీ వుంటుందని వివరించారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించి చెప్పటంతో పాటు , ప్రజలు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలుగా మారటానికి కలెక్టర్ ద్వారా బ్యాంకర్స్ తో మట్లాడించి లోన్స్ అందుకునే వరకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ అబ్దుల్ హుస్సేన్, కౌన్సిలర్ నాళ్ళ సురేంద్ర, జీడిమల్ల సత్యవతి , కందిమళ్ళ శేషగిరిరావు , మోదుగు వెంకటేశ్వరరావు , టిడిపి నాయకులు సోమవారపు శ్రీనివాసరావు , బూత్ కన్వీనర్ సోమవారపు నాగేశ్వరావు, ఆలపాటి గంగరాజు ,సుంకర లతా, అబ్బాస్, తుళ్లూరి అనిల్ లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News