గ్రామాల్లో మంచి నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి

-ఎమ్.డి.వో కి విన‌తి ప్ర‌తం అంద‌జేసిన పంచాయ‌తీ ఛాంపియ‌న్స్

వీరుల‌పాడు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయ‌తీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో శిక్షణ పొందిన పంచాయ‌తీ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ జి.వి.న‌ర‌సింహారావు ఆధ్వ‌ర్యంలో మండ‌ల నీటి సంఘం అధ్య‌క్షుడు కాపా రాంబాబు ల‌తో క‌లిసి గ్రామాల్లో నెల‌కొన్న తాగునీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌ను త‌క్ష‌ణం పరిష్కారించాల‌ని కోరుతూ బుధ‌వారం జుజ్జూరు గ్రామంలో మండ‌ల‌ అభివృద్ది అధికారి అరుంధ‌తి దేవికి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

వీరుల‌పాడు మండ‌లంలోని క్లస్టర్ గ్రామాలైన బోడవాడ, జమ్మవరం, వెల్లంకి, నందలూరు, దాచవరం, తాటిగుమ్మి గ్రామాల్లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌తో పాటు గ్రామంలో నెల‌కొన్న ఇత‌ర ఇబ్బందుల‌ను మండ‌ల అభివృద్ధి అధికారి అరుంద‌తి దేవి కి వివ‌రించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆశ‌య‌మైన విక‌సిత్ పంచాయ‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా పరిపూర్ణ గ్రామ వికాసం కోసం ఈ గ్రామాల్లో నిర్వ‌హించిన ప‌లు కార్య‌క్ర‌మాలు ద్వారా ఈ స‌మ‌స్య‌లు త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. వేస‌వి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను నీటి ఎద్ద‌డి స‌మ‌స్యను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌న్నారు. అవ‌స‌ర‌మైన గ్రామాల‌కు వాట‌ర్ ట్యాంకర్స్ ద్వారా మంచినీటి స‌ర‌ఫ‌రా చేసి ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. అలాగే గ్రామాల్లో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ తెలుసుకున్న స‌మ‌స్య‌ల‌పై త‌యారు చేసిన నివేదిక‌ను కూడా విన‌తి ప‌త్రం తో పాటు ఎమ్.డి.వో అరుంధ‌తి దేవికి అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *