Breaking News

జిల్లాలో మహిళల భద్రతే ధ్యేయంగా రంగంలోకి 7 శక్తి బృందాలు

-ప్రతి సబ్ డివిజన్ కు ఒక శక్తి బృందం, జిల్లా హెడ్ క్వార్టర్ లో రెండు బృందాలు… ఒక్కో బృందంలో ఎస్ఐ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు కల్గిన పోలీసు సిబ్బంది.
-మహిళల్ని వేధించే వారి భరతం పట్టేందుకు కృషి చేయనున్న “శక్తి టీమ్స్”.
-”శక్తి యాప్” ప్రతి మహిళకు రక్షణక కవచం వంటిది.
-తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.,.
-శక్తి టీం వాహనాలు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేశామని…మహిళల భద్రత కోసం నూతనంగా 7 శక్తి బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపామని జిల్లా ఎస్పీ  డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆవరణలో జిల్లా ఎస్పీ  పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శక్తి – ” మీ రక్షణ-మా ధ్యేయం” అనే నినాదంతో రూపొందించిన వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…మహిళలు సురక్షితంగా ఉన్న చోట సమాజం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. 24 గంటలు శక్తి టీమ్స్ విధి నిర్వహణలో ఉంటారన్నారు. బాలికలు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సకాలంలో ఎలా స్పందించాలో, ఎంత సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలో శక్తి టీమ్స్ కు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, పార్కులు, ఆర్టీసీ బస్టాండ్లు, ముఖ్య కూడళ్ళును మఫ్టీలో నిఘా వేస్తారన్నారు. ఆపద సమయంలో శక్తి యాప్ నకు వచ్చే ఎస్.ఓ.ఎస్.కాల్స్, డయల్ 112/9493206006( వాట్సప్ నెంబర్) కాల్స్ తో సంఘటన స్థలంకు ఈ టీమ్స్ వెళ్తాయన్నారు. కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై సకాలంలో సంఘటనా స్ధలంనకు చేరుకొని సమస్యలను చట్టబద్దంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టేలా దిశానిర్ధేశం చేశారు. మహిళా చైతన్యం, స్వేచ్ఛ, భద్రత నినాదంతో శక్తి బృంద సభ్యులు పనిచేయాలని సూచించారు. మహిళలకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, వారి మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)  ఎన్. బి.ఎం మురళీకృష్ణ , అడిషనల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్) ఏ.వీ సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎల్. అర్జున్, డి.ఎస్.పి(ఎస్ బి) బి. రామకృష్ణ , జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్(ఎస్ బి) ఏ. శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్(డి సి ఆర్ బి) పవన్ కుమార్ రెడ్డి, శక్తి టీం మహిళా పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *