-సి సి ఎల్ ఏ ఆదేశాలతో రీ సర్వే నిర్వహిస్తున్నాం
-ఆర్డీవో రాణి సుస్మిత
దేవరపల్లి , నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం నియోజక వర్గం దేవరపల్లి మండలం కుకునూరు గ్రామంలో చేపట్టిన భూముల రీ సర్వే పై అభ్యంతరాలు నేపధ్యంలో సి సి ఎల్ ఏ కమీషనర్ ఆదేశాలను అనుసరించి క్షేత్ర స్థాయిలో రీ సర్వే నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు రెవిన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. బుధవారం కుకునూరు గ్రామంలో రీ సర్వే నిమిత్తం ఆర్డీవో అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. . భూ యజమానులు, రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో కూడి భూముల రీ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు, రీ సర్వే లో తగిన వివరాలు అందచేసి అధికారులకి, క్షేత్ర స్థాయిలో సిబ్బందికి సహకరించండి అని ఆర్డీవో రాణి సుస్మిత కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వే, సర్వే బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News