రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్న అదనపు ఆర్ధిక సహాయం మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో లబ్ధిదారులతో గృహ నిర్మాణ పథకం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 21,584 మంది అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాల దశలో ఉన్న లబ్ధిదారులను కలిసి ప్రభుత్వ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు , గృహ నిర్మాణ సంస్థ, గ్రామ మండల స్థాయి అధికారులతో కలిసి అవగాహన కల్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ బీసీలకు రూ.50,000 , ఎస్టీలకు రూ.75000 ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా గృహ నిర్మాణ పనులను ఎటువంటి ఆటకం లేకుండా పూర్తి చేయాలని లక్ష్యంతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సొంత ఇంటి కల సహకారం చేసుకోవాలన్నారు. గృహ లబ్ధిదారుల ఇంటింటి సందర్శన కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 5804 మందికి సమాచారం ఇచ్చి 5758 లబ్ధిదారులను నేరుగా కలవడం జరిగింది అన్నారు వారిలో 4409 మంది ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో గృహ నిర్మాణం చేపట్టేందుకు అంగీకరించి తెలిపారన్నారు. మే 2025 చివరి నాటికి ఇంటి నిర్మాణం పూర్తి చెయ్యడం కోసం జిల్లాకు 6 వేల గృహాలను లక్ష్యంగా నిర్ధేశించినట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 133 సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణం కోసం లబ్దిదారులను కలిసి అవగాహనా కల్పించే క్రమంలో పేలవమైన పనితీరుచూపడం అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిపారు
ఎంపిడివో లు, గృహ నిర్మాణ సంస్థ అధికారులు, క్షేత్ర స్థాయిలో అధికారులకు ఆయా సిబ్బంది వివరాలు తెలియ చేయడం జరిగిందనీ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో హౌసింగ్ డిప్యూటి ఈ ఈ శేఖర్ బాబు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పర్యటించారు.
Prajavartha Online Telugu News