రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం నందు కమిషనర్ , జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదేశాల మేరకు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు సిబ్బందికి జిల్లాలో రాబోవు వడదెబ్బ పరిస్థితినీ దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళిక సంసిద్ధత మరియు తీసుకోవాల్సిన నియంత్రణ, నివారణ చర్యలు గురించి జాగ్రత్తలు తీసుకుని చేయవలసిందిగా ఆదేశించారు. ఆమేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. చెయ్య తగినవి, చెయ్యకూడని వాటిపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం ముఖ్యం అని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సూచనలు మార్గదర్శకాలు మరియు సమాచారాల ప్రకారము జాగ్రత్తలు తీసుకోవాలని వేసవి రోజుల్లో వేడి తరంగాలు మరియు తీవ్రమైన వేడి తరంగాలు పెరిగే అవకాశం ఉంటుందని దీని ప్రకారం పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలు తగు సూచనులు జాగ్రత లు పాటించాలి తెలియ చేశారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వారు ప్రజలకు సూచనలు ఇవ్వాలని కోరారు. అందరూ వైద్యాధికారులు ఆరోగ్య సహాయకులు మరియు పర్యవేక్షణ సిబ్బంది ఆశలు గ్రామ సచివాల సిబ్బంది కి సూచనలు ఇవ్వడం జరిగింది.
గ్రామస్థాయిలోని అంగన్వాడీ ఆరోగ్య సహాయకులు పంచాయతీ కార్యదర్శుల వద్ద ORS పాకెట్స్ అందుబాటులో ఉంచామని ఆరోగ్య సహాయకులు మరియు వైద్యాధికారులు గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలకు వడదెబ్బ తగలకుండా వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, త్రాగు నీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలనీ తెలియచేసారు. గర్భిణులు, బాలింతలు , పిల్లలు నా వృద్దులు పై ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఎండ గాలులు తగలకుండా చేసుకోవాలని తెలియ చేశారు. బస్ స్టాండ్, మార్కెట్ వద్ద, ఇతర రద్దిగా ఉండే ప్రాంతాలలో చలివెంద్రలు ఏర్పాటు చేయాలనీ తెలియ చేశారు. అదేవిదంగా ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్య సిబ్బంది ని సంప్రదించాలని, ఉదయం 11 గంటలకు బయట పనులు ముగించుకుని ఎండ తీవ్రత తగలకుండా గృహలలో ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలియ చేశారు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళినప్పుడు వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే అవి వడ దెబ్బ అని గుర్తించాలి
చేయవలసినవి
1. నెత్తిన టోపీ పెట్టుకోవాలి లేదా కర్చీఫ్ చుట్టుకోవాలి తెలుపు రంగు గల బట్టలను ధరించాలి
2. ఎండలో నుండి వచ్చిన నీళ్లు గాని నిమ్మరసం గాని కొబ్బరి నీళ్లు గాని తాగాలి
3. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రాకపోతే శీతల వాతావరణం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి
4. ఉప్పు కలిపిన మజ్జిగ , గ్లూకోజ్ ,ఓఆర్ఎస్ కలిపిన నీటిని తీసుకోవాలి
చేయకూడనివి
1. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు
2. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో) బయటఎక్కువ శారీరిక శ్రమ పనిని చేయకూడదు
3. ఎండలో నుండి వచ్చిన వెంటనే తేనే వంటి తీపి పదార్థం తినకూడదు
4. సూర్య కిరణాలు వడదెబ్బకు లోను కాకూడదు గొడుగు గాని టోపీ గాని వాడవలెను
5. శీతల పానీయములు ఐస్ వంటి పదార్థాలు తీసుకుంటే అనారోగ్యం పాలవుతారు
ఈ పై జాగ్రత్త లు ప్రజలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ జె సంధ్య,
కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య, డిప్యూటి డెమో Dr సత్య కుమార్ , Dr మౌనిక , CHO జాన్సన్, శర్మ, DR నిశాంత్, షమ్మీ కుమార్ , ఆఫీసర్ మలేరియా సత్యనారాయణ, ఇతర సిబ్బంది మూర్తి, ప్రసాద్, శ్రీనివాస్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News