Breaking News

మార్చి 22 న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సంకల్ప మెగా జాబ్ మేళా

-ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి
-ఆర్ట్ కళాశాలలో శనివారం ఉదయం 9.30 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ
-గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కు చెందిన నిరుద్యోగ యువత సంకల్ప మెగా జాబ్ మేళా కు హాజరై ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.  గురువారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో “సంకల్ప – జాబ్ మేళా” పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ” సంకల్ప – మెగా జాబ్ మేళా” నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సంకల్ప మెగా జాబ్ మేళాలో 25 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, వివిధ ఉద్యోగాల్లో చేరేందుకు ఎస్.ఎస్.సి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.టెక్, ఎం.టెక్, ఫార్మసీ, ఎం.బి.ఎ, ఎం.కాం తదితర కోర్సులు పూర్తిచేసిన 19 నుండి 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియ చేశారు.

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళీ వివరాలు తెలియ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు జిల్లా ఉపాధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి నియోజకవర్గంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల), వై-జంక్షన్ ప్రాంగణంలో మార్చి 22 శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్ధులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, తగిన ప్రమాణాలతో ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తీ కలిగిన నిరుద్యోగ యువత https://naipunyam.ap.gov.in/ user-registration వెబ్సైట్ ద్వారావారి పేర్లు నమోదు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యుమే, ఆధార్ కార్డు, విద్యా సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు తదితర అవసరమైన పత్రాలతో ఈ నెల 22వ తేదీ, శనివారం ఉదయం 9:30 గంటలకు హాజరుకావాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం, మరింత సమాచారం కొరకు
9988853335, 8712655686, 8790118349, 8790117279 ఫోన్ నెంబర్ లని ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎ. అప్పలకొండ, డి ఎస్ డి వో విడిజి మురళీ, జిల్లా పర్యటక అధికారి పి. వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *