Breaking News

వేసవి దృష్ట్యా ఈ ఏడాది వడగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంటుంది

-అనుకొని సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
-అటువంటి ఘటనలు నేపధ్యంలో త్రీ మ్యాన్ కమిటి ద్వారా 24 గంటల్లో నివేదిక అందచెయ్యలి
-అన్నీ పాఠశాలలు,అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించాలి
-ఉపాధిహామీ, విద్యా సంస్థలు ఆధ్వర్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు విషయములో జాగ్రత్తలు తీసుకోవాలి
-స్వచ్ఛంధ సంస్థలు, పరిశ్రమల ఆధ్వర్యంలో చలివేంద్రాలని ఏర్పాటు చెయ్యాలి.
-జిల్లా వ్యాప్తంగా అన్ని సి హెచ్ సి, పి హెచ్ సి, హెల్త్ కేంద్రాలలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి
-పంచాయతిల ఆద్వర్యంలో గ్రామాలలో వడగాల్పులు నేపధ్యంలో “టాం టాం” నిర్వహించాలి
-కలక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే నేపధ్యంలో వడగాలులు వీచే అవకాశం ఉందని, క్షేత్ర స్థాయిలో మునిసిపల్ , పంచాయతీ అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అందులో భాగంగానే ప్రజల్లో అవగాహన కలుగచెయ్యలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.

గురువారం ఉదయం వడగాలులు నేపథ్యంగా స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరం నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో వడగాలులు తీవ్రత దృష్ట్యా సమన్వయ శాఖల శుక్రవారం ఉదయం రెవిన్యూ డివిజనల్ అధికారులు, సాయంత్రం మండల, మునిసిపల్ అధికారులు సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చెయ్యాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎస్ వో పి పై మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు. చలివేంద్రాలలో కుండల ద్వారా చల్లని శుద్ధమైన త్రాగునీరు సరఫరా చెయ్యాలని, ఇందుకు స్వచ్ఛంధ సంస్థలు,పరిశ్రమల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వ ప్రవేటు పాఠశాలల , అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తుా, తరగతులు నిర్వహించే వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వడగాలులు తీవ్రత దృష్ట్యా చెయ్య తగినవి,చెయ్యకూడని పై గ్రామాల్లో, వార్డుల్లో ప్రచారం చేయడం వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు. వాటిని గ్రామస్థాయిలో, క్షేత్ర స్థాయిలో ప్రచారం కల్పించడం ముఖ్యం అన్నారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) పై తగిన మార్గదర్శకాలు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది అని పేర్కొన్నారు. ఉపాధిహామీ కూలీలు పనిచేసే ప్రదేశాల్లో నీడ ఉండేలా టెంట్స్ ఏర్పాటు,త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ అందుబాటులొ ఉంచడం వృద్ధులు , గర్భిణీలు, బాలింతలు, పాలిచ్చే తల్లులు విషయంలో వారికీ సాధ్యం అయ్యే పనులను ఇవ్వడం, ఎండ తీవ్రత పెరగకుండా సమయ పాలన విషయంలో ముందుగా పనులను ప్రారంభించాలన్నారు

ఐస్ ఫ్యాక్టరీలను తనిఖీ చేయండి – కలక్టర్

. వేసవి దృష్ట్యా ఐస్ సరఫరా చేసే ఫ్యాక్టరీ ల నిర్వహణ వ్యవస్థ దృష్టి పెట్టాలని, శుద్ధమైన నీటితో మాత్రమే ఐస్ తయారు విధానం లో ఉపయోగిస్తున్నారో లేదో తనిఖీ లు చేయాలన్నారు.

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. పాఠశాలల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జిల్లా పాఠశాల విద్యాధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్ నాగేశ్వర రావు సెల్ నెంబరు +919398680029 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ కార్యాలయం పనిచేసే సమయంలో ఫిర్యాదు చెయ్యవచ్చు అన్నారు.

రక్షిత, శుద్ధమైన త్రాగునీరు సరఫరా పై నిఘా వ్యవస్థ పెట్టాలని , వో ఆర్ హెచ్ ట్యాంకులు, నీటి సరఫరా చేసే ట్యాంకర్ల నిర్వహణ వ్యవస్థ పై తనిఖీలు నిర్వహించి, నిర్ణీత కాలవ్యవధితో ప్రోటోకాల్ అనుసరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

వడగాలులు తీవ్రత వల్ల అనారోగ్యం పాలు, మరణాలు సంభవిస్తే వారిపై కమిటీ సభ్యులు అధ్వర్యంలో 24 గంటల్లో నివేదిక అందజేయాలన్నారు. తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్, పోలీస్ అధికారి సంయుక్తంగా కలిసి పని చేసి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు, ఉపాధిహామీ పథకం కార్మికులకు, విద్య సంస్థలకు, తగిన విధంగా వో ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు కోరారు. శాఖ పరమైన ఇండెంట్ ఇవ్వాలని కలక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పి హెచ్ సి పరిథిలో తగిన స్టాక్ అందుబాటులొ ఉంచడం జరిగిందన్నారు.

వేసవదృష్ట్యా అధిక లోడు తో వెళ్ళే, సరుకులు తీసుకునే వెళ్ళే భారీ వాహనాలు ప్రయాణాలపై, ప్రయాణికులను తీసుకునీ వెళ్ళే వాహనాల ను తనిఖీలు నిర్వహించాలని కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆయా వాహనాలు నడిపే వాహన చోదకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు.

ఈ సమావేశంలో కే ఆర్ సి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ బీవీ గిరి, జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి,  డీఈవో ఎస్ వాసుదేవరెడ్డి, డి ఎల్ డి ఓ పి వీణ దేవి, ఐసిడిఎస్పిడి కే విజయ్ కుమారి, డీఎంహెచ్వో తరపున ఎన్. వసుంధర, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *