Breaking News

వేసవిలో ప్రజల దాహర్తి తీర్చడంలో భాగస్వాములు కండి..

-గుక్కెడు చల్లటి నీరు అందించి దాహర్తిని తీర్చండి..
-శిరీష్మ ట్రస్ట్‌ సేవలు స్పూర్తిదాయకం..
-దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం..
-జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో గుక్కెడు చల్లటి త్రాగు నీరుని అందించే పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రజల దాహర్తి తీర్చేందుకు ముందుకు రావాలని చలసాని శిరీష్మ కుటుంభ్యుల సేవలను స్పూర్తిదాయకంగా తీసుకోవాలని దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి నీరు, మజ్జిగ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
చలసాని శిరీష్మ జ్ఞాపకార్థం కుటుంభ్యుల ఆధ్వర్యంలో స్థానిక రాఘవయ్య పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు ఆర్వో ప్లాంట్‌ మరియు వైద్య శిబిరాలను గురువారం జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్య అవకాశం ఉన్నయాని వాతావారణ శాఖ అధికారులు సూచిస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలో ప్రజలు దాహర్తిని తీర్చడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. రాజధానికి కేంద్ర బిందువైన విజయవాడ నగరానికి నిత్యం అనేక ప్రాంతాల నుండి వేలాదిమంది ప్రజలు విచ్చేస్తారన్నారు. వేసవి ప్రజలకు గుక్కెడు చల్లటి త్రాగునీరు అందించడం మంచి పుణ్య కార్యక్రమం అవుతుందన్నారు. త్రాగునీరు అందించేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ వారి ఇల్లు లేదా వ్యాపార సంస్థ వద్ద మట్టి కుండలను, కూలింగ్‌ టిన్నులను ఏర్పాటు చేసుకుని దాహంతో ఉన్న వారికి చల్లటి నీరు మజ్జిగలను పంపిణీ చేయాలని ఇది ఎంతో పుణ్య కార్యక్రమం అని కలెక్టర్‌ తెలిపారు. వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, ఆవాసా గ్రామలలో సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, రక్షిత నీటి సరఫరా పథకాలు, పంపింగ్‌ పథకాలు, చేతిపంపులు ఉన్నాయని వీటికి అవసరమైన మరమత్తులు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆర్వో ప్లాంట్స్‌ ద్వారా ప్రజలకు త్రాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రజలకే కాదు పశుపక్ష్యాదులకూ కూడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే దాతలకు జిల్లా యంత్రాంగం పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రజలు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.
ఏపిఎన్‌జివో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్‌ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు అనేక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలన్న జిల్లా కలెక్టర్‌ పిలుపు మేరకు నగరంలోని రద్దీ ప్రాంతాలలో ఏపిఎన్‌జివో అసోసియేషన్‌ పక్ష్యాన చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శిరీష్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి ప్రాతంలో రక్షిత మంచి నీటి పథకాన్ని ఏర్పాటు చేసి చల్లటి త్రాగునీటి మజ్జిగను పంపిణీ చేయడం ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు.
చలసాని శిరీష్మ తండ్రి వాటర్‌ ప్లాంట్‌ నిర్వహకులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో శిరీష్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరును అందించాలనే లక్ష్యంతో రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు చల్లటి త్రాగునీటిని అందజేస్తున్నామన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించాలనే ఉద్ధేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి అవసరమైన మందులను సరఫరా చేయడం జరిగిందన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో గిరిజనలకు అవసరమైన పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డా. రామ శేషయ్య, సామాజిక విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ, సామంతపూడి చైతన్య, ఎన్‌.నారాయణ, ఏపిఎన్‌జివో నాయకులు డి.సత్యనారాయణ రెడ్డి, పి. రమేష్‌, సివిఆర్‌ ప్రసాద్‌, నజీర్‌రుదీన్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *