-ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియా సమావేశం
-వైజాగ్ స్టేడియం పేరు మార్చలేదు..
-ముఫ్పై ఏళ్లుగా ఏ పేరు వుందో ఆ పేరు తొలగించలేదు
-ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ స్టేడియం
-అమరావతి స్టేడియానికి ఐసిసి చైర్మన్ జైషా అనుమతి
-అమరావతి లో కూడా స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ
-విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీ
-ఎపిలో క్రికెట్ అభివృద్దికి బిసిసిఐ సహకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపిలోని 175 నియోజకవర్గాల్లో ఏడాదికి 30 గ్రౌండ్స్ చొప్పున అభివృద్ది చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు,విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఎపిలో ఎసిఎ చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలు తెలియజేసేందుకు శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎసిఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య శాఖ మంత్రి లోకేష్ కారణంగా తాను ఎసిఎ అధ్యక్షుడు అయినట్లు తెలిపారు. వైజాగ్ క్రికెట్ స్టేడియం పేరు గత ముప్పై ఏళ్లుగా ఏదైతే వుందో అదే వుందని, ఆ పేరు తొలగించలేదన్నారు. గతంలో వైజాగ్ స్టేడియంలో రెండు ఐపిఎల్ మ్యాచులు జరిగాయి. ఈ సారి కూడా మ్యాచులు నిర్వహించాలని ఢిల్లీ కెప్టెన్స్ ను అడిగాము…అయితే స్టేడియం నిర్వహణ, సదుపాయాల పై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ జి.ఎమ్.ఆర్ యాజమాన్యంతో మాట్లాడగా, స్టేడియం ఆధునికరిస్తే మ్యాచులు నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపారు.
డిసెంబర్ 20వ తారీఖు ఈ విషయం తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి వల్ల జనవరి 20 వరకు పనులు మొదలుపెట్టలేకపోయమన్నారు. సమారు ఎనిమిది నెలలు పట్టే పనులను ఒకటిన్నర నెలలో మార్చి 10 కల్లా స్టేడియం మొత్తం ఆధునీకరించినట్లు తెలిపారు. స్టేడియంలో 34 గదులతోపాటు, హైజినిక్ గా వుండే 320 టాయిలెట్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో స్టేడియంలో 53 టాయిలెట్స్ మాత్రమే వుండేవన్నారు. స్టేడియం మొత్తం ఎల్.ఈ.డీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రెస్ గ్యాలరీ కూడా ఆధునీకరించినట్లు చెప్పారు.
ఇటీవల ఢిల్లీ కెప్టెన్స్ ప్రతినిధుల బృందం స్టేడియం ఆధునికరణ పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేసిందని, మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు ఇండియాలోనే ది బెస్ట్ డ్రెసింగ్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ప్రశంసించారని తెలిపారు. అంతే కాదు రెండు నెలల్లో పూర్తిచేసిన విధానాన్ని మెచ్చుకున్నారని చెప్పారు. సెక్యూరిటీ పనుల వల్ల స్టేడియం ఎలివేషన్ పనులు నిలిపివేశామని, రెండు ఐపిఎల్ మ్యాచులు పూర్తి అయిన తర్వాత ఎలివేషన్ పనులు మొదలు పెడతామన్నారు. ఎలివేషన్ కూడా చాలా అందంగా వుంటుందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచేలా వైజాగ్ క్రికెట్ స్టేడియం వుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 800 మంది రాత్రి పగలు కష్టపడటం వల్ల , అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో రెండునెలల్లో పూర్తి చేయటం జరిగిందన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అమరావతిలో నిర్మించబోయే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రెండున్నరేళ్లలో పూర్తి చేయటం జరుగుతుందన్నారు. ఏ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న బిసిసిఐ అనుమతి తీసుకోవాలి. ఐసిసి చైర్మన్ జైషాను అడగటం జరిగింది. సానుకూలంగా స్పందించారు. అయితే మంత్రి నారా లోకేష్ అడిగిన తర్వాత వెంటనే అనుమతి ఇచ్చారన్నారు. స్టేడియం 365 రోజులు పనిచేసే విధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రణాళిక సిద్దం చేశారన్నారు. ఆ ప్రణాళిక ప్రకారం రాబోయే రెండున్నర సంవత్సరాల్లో స్టేడియం నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తుందన్నారు.త్వరలో మరో అంతర్జాతీయ స్టేడియం ఆంధ్రప్రదేశ్ కిరాబోతుందన్నారు.
ఎపికి నేషనల్ గేమ్స్ తో పాటు అన్ని క్రీడలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలను నెలకొల్పబోతున్నట్లు తెలిపారు. ఈఅకాడమీల్లో ట్రైనింగ్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా వుంటుందన్నారు. ఐపీఎల్ లో మరింత మంది రాష్ట్రానికి చెందిన ప్లేయర్స్ క్రికెట్ ఆడే విధంగా వసతులు కల్పిస్తామన్నారు.
మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి సీనియర్ నాయకులు నరసింహాచౌదరి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News