విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, విద్యా, ఐటి శాఖ మంత్రి కుమారుడు నారా దేవాన్ష్ 10 వపుట్టిన రోజు వేడుకలు ఐటిడిపి టీమ్ వర్తికూటి నితిన్ కుమార్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఎంపికేశినేని శివనాథ్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వర్తికూటి నితిన్ కుమార్ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) దేవాన్ష్ కి ఆశీస్సులు తెలిపారు. తాతకి తగ్గ మనవడిగా , తండ్రి తగ్గ తనయుడిగా నిండూ నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, టిడిపి నాయకులు వేదవ్యాస్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News