-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలోని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈరోజు అనంతపురం జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ 30వ వార్షికోత్సవ మహాసభ అనంతపురంలో జరిగింది. ఈ సభలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో దాదాపు 30 వేల మంది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎంపీల సేవలు ప్రజలకు చేరువుగా ఉన్నాయన్నారు. లావాపేక్ష ఆశించకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే సదుద్దేశంతో వీరు చేస్తున్న సేవలను రామకృష్ణ కొనియాడారు. ఉగాది నుండి పి-4 పద్ధతిని అమలు చేస్తామంటూ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం అని చెబుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య రంగంలో ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. తద్వారా వైద్య రంగాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని రామకృష్ణ అన్నారు.
Prajavartha Online Telugu News