Breaking News

బ్యూటీషియన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం, కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్యాలీ సర్టిఫికెట్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
HCL ఫౌండేషన్ మద్దతుతో వాసవ్య మహిళా మండలి 24 మార్చి 2025న బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, కుట్టు యంత్రాలను పంపిణీ చేసి, టాలీ శిక్షణార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. డాక్టర్ బి కీర్తి అధ్యక్షురాలు వాసవ్య మహిళా మండలి, కొనసాగుతున్న టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ మరియు టాలీ శిక్షణల గురించి మాట్లాడారు. మహిళా సాధికారత మరియు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి అన్ని శిక్షణలు ఉచితంగా ఇస్తున్నాము అని అన్నారు. డాక్టర్ దీక్ష వాసవ్య మహిళా మండలిలో ఉన్న పిల్లలకి ఇంగ్లీషు మరియు చేతివ్రాత నేర్పుకోవడానికి HCL నుండి స్వచ్ఛందo గా సేవలు అంధిస్తున్నారని అన్నారు. డిప్యూటీ మేనేజర్, బి. శ్రీనివాసులు మాట్లాడుతున్నారు, ఈ కోర్సుల ద్వార మహిళలు సాధికరత పొందాలని, జీవన ప్రమాణాలను పెంచుకోని మరియు వ్యవస్థాపకులుగా మారాలనీ సూచించారు. సీనియర్ మేనేజర్ జాషువా మాట్లాడుతు వాసవ్య మహిళా మండలి శిక్షణార్థులకు ధైర్యంగా ఉండటానికి మరియు స్వతంత్రంగా ఉండటానికి కౌన్సెలింగ్ మరియు సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తోంది అన్నారు. HCL ఫౌండేషన్ వాసవ్య మహిళా మండలితో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమములో వాసవ్య మహిళా మండలి కార్యకర్తలు, బ్యూటీషియన్, టైలరింగ్, టాలీ ట్రైనీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *