Breaking News

ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు , డిఆర్ఓ షేక్. ఖాజావలి , ఆర్డిఓ శ్రీనివాస రావు ప్రజల నుండి 231 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటీషన్లను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. మరో 24 గంటల్లో 18 పిటీషన్లు గడువు ముగిసి బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్ళే అవకాశం ఉన్నందున సోమవారం సాయంత్రం లోపు పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ సమీక్షించి సూచనలు చేసారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని నిర్ణీత గడువు లోపు ఎట్టి పరిస్తితుల్లోను పరిష్కరించాల్సి వుందన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సమీక్షిస్తూ గౌరవ కోర్టులకు ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు పరచాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కేసు కంటెమ్ట్ వరకు వెళ్ళకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ జ్యోతిబసు , డీఆర్డిఏ , డ్వామా , హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు విజయలక్ష్మీ, శంకర్, ప్రసాద్ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , ఎస్.ఈ పంచాయితీ రాజ్ బ్రహ్మయ్య , ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాశ్ , ఎల్ డి ఎం మహిపాల్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *