గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక బృందాల నుండి పీడీ మెప్మా వి.విజయలక్ష్మీ సాయుధ దళాల పతాక దినోత్సవం 2024 నిధికి విరాళాల నిమిత్తం సేకరించిన మొత్తం రూ. 2,05,197/- (అక్షరాల రెండు లక్షల ఐధు వేల నూట తొంబై ఏడు రూపాయులు మాత్రమే) చెక్కును సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ చేతుల మీదుగా గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి ఆర్ గుణ షీలా కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అధిక మొత్తంలో విరాళాలు సేకరించిన పీడీ మెప్మా వి.విజయలక్ష్మీ ని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్. ఖాజావలి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు , జెడ్పి సిఇఓ జ్యోతిబసు , డీఆర్డిఏ , డ్వామా , హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు విజయలక్ష్మీ, శంకర్, ప్రసాద్ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , ఎస్.ఈ పంచాయితీ రాజ్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News