మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలానికి చెందిన చిన గోల్లపాలెం, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక తీరప్రాంత గ్రామం. సముద్రపు అలల ఉద్ధృతికి భూమి కోల్పోతున్నందున గ్రామస్థులకు మరియు సాగు భూములకు ఇక్కడ తీవ్రమైన నష్టం జరుగుతోంది.
ఇక్కడ ఉప్పెనల (High tides) ఉద్ధృతి పెరగడం, అలలు భూమిని క్రమంగా దుమ్ము చేయడం, కలుషిత నీటి ప్రవాహాలు సముద్రతీరాన్ని నెమ్మదిగా దెబ్బతీయటం, వాతావరణ మార్పులతో సముద్ర స్థాయి పెరగడం, అతిగా ఇసుక తవ్వకాలు తీరప్రాంత భూమిని బలహీనం కావడం, మ్యాంగ్రోవ్ అడవుల నాశనం వలన ప్రకృతిసిద్ధమైన రక్షణ కోల్పోవడం, పట్టణీకరణ, నిర్మాణ పనులు, తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల భూగర్భ మార్పులు జరగడం, సముద్రపు అలల ధాటికి భూమి కొట్టుకుపోయి, క్రమంగా గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా నది, సముద్రపు నీరు భూముల్లోకి చొచ్చుకుపోవడం వల్ల వ్యవసాయ భూములు ఉప్పు నేలగా మారుతున్నాయి. జీవనోపాధిపై ప్రభావం చూపిస్తోంది. మత్స్యకారుల జీవనాధారం దెబ్బతింటోంది, వేటకారులు తమ ప్రదేశాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇందుకు & పరిష్కార మార్గాలు ఏమిటంటే :
1. రక్షణ గోడల నిర్మాణం: సముద్రపు అలలను అడ్డుకునేందుకు రక్షణ గోడలు (Sea Walls) & బ్రేక్ వాటర్ స్ట్రక్చర్స్ నిర్మించడం.
2. మడ అడవుల పరిరక్షణ: ప్రకృతిసిద్ధంగా సముద్రపు అలలను అడ్డుకునేందుకు మ్యాంగ్రోవ్ మొక్కలను పెంచడం
3. ఇసుక తవ్వకాలను నియంత్రణ: అక్రమ ఇసుక తవ్వకాలను కఠినంగా నిరోధించడం
4. తీరప్రాంత సంరక్షణ ప్రణాళికలు: సైన్సటిఫిక్ కోస్టల్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రూపొందించి, టెక్నాలజీ సహాయంతో సముద్రపు అలలను అరికట్టడం
5. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు: తీరప్రాంత గ్రామాలను తరలించేందుకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, రైతులకు నష్టపరిహారం అందించడం వంటి పనులు జరగాల్సి ఉంది.
ఇందుకోసం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు ఈ రోజన ఢిల్లీ లోని నేషనల్ డిశాస్టర్ మేనేజుమేంట్ అథారిటీ మెంబర్ మరియు హెడ్ అఫ్ డిపార్ట్మెంట్ శ్రీ రాజేంద్ర సింగ్ గారిని కలిసి కృత్తివెన్ను మండలంలోని చిన గొల్లపాలెంలో సముద్రపు అలల వలన క్రమంగా క్షీణిస్తున్న భూమి గురించి, అందుకు తీసుకొనవలసిన రక్షణ చర్యల గురించి మాట్లాడటం జరిగింది.
వారు ఎంపి వినతికి సానుకూలంగా స్పందించి వెంటనే తగు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన యెడల, నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకొంటామని తెలియ పరిచారు.
Prajavartha Online Telugu News