మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ విధులు బాధ్యతాయుతంగా అంకితభావంతో నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచించారు.
బుధవారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నగరంలోని వారి చాంబర్లో 17 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. అందులో 12 మంది జూనియర్ అసిస్టెంట్లుగా, మరో 5మంది టైపిస్టులుగా నియమించబడ్డారు. జిల్లాలోని ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మంది విధి నిర్వహణలో ఉంటూ మరణించడంతో వారి వారసులకు నియామక పత్రాలు అందజేసినట్లు జడ్పీ చైర్ పర్సన్ వివరించారు. కొత్తగా నియమించబడిన ఉద్యోగులు సజావుగా వారికి అప్పగించిన విధులను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈఓ కన్నమ నాయుడు, డిప్యూటీ సీఈవో ఆనందకుమార్ జెడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News