గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తుళ్ళూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో మార్చి 30 వ తేది పీ-4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 30 వ తేది ప్రభుత్వ, ప్రైవేట్ , ప్రజల భాగస్వామ్యంతో పీ-4 విధానాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టాలని , త్రాగునీరు అందుబాటులో వుంచాలని, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పోలీసు శాఖాధికారులు బందోబస్తు ఏర్పాట్లు , ఆర్ అండ్ బి అధికారులు బారీకేడింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. నిరంతర విద్యుచ్ఛక్తి సరఫరా జరిగేటట్లు విద్యుత్ శాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ తమకు కేటాయించిన విధులను తప్పకుండా పాటించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డిఓ కె.శ్రీనివాస రావు, జెడ్పీ సిఇఓ జ్యోతిబసు, పీడీ డ్వామా శంకర్ , డిపిఓ నాగసాయి కమార్ , ఆర్ అండ్ బి ఎస్.ఈ కళ్యాణ చక్రవర్తి ,జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వెంకటేశ్వర్లు, డి యం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , డిసిహెచ్ ఎస్ మయానా మజీదాబి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మీ, తుళ్ళూరు , గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్లు సుజాత , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News