Breaking News

ప్రజా వినియోగ సర్వీసుల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

– ప్రజా వినియోగ సేవలపై  పారా లీగల్ వాలంటీర్లు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి
– ప్రజలకు హక్కులు, అవకాశాల పై అవగాహన కల్పించడంపై  ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుంది
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా వినియోగ సేవలను అందించే సంస్థలు (పబ్లిక్ యుటిలిటీ కంపెనీలు)  మారుమూల ప్రాంతాల్లో నివసించే  ప్రజలందరికీ  ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలు విషయమై అవగాహన కల్పించే విధంగా చైతన్యం తీసుకుని రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.

స్ధానిక జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలోని డిఎల్ఎస్ఎ శనివారం పి ఎల్ వి లకు, శాశ్వత లోక్ అదాలత్ బృందాల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి గంధం సునీత , పర్మనెంట్ లోక్ అదాలత చైర్మన్ ఏ. గాయత్రీ దేవి , జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీ లక్ష్మీ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, ప్రజా వినియోగ సేవలుపై వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంస్థలలో అమలు చేస్తున్న పథకాలను, కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ఆయా వర్గాలకు చేరవేయడం లో పారా లీగల్ వాలంటీర్ల కు ప్రతినెలా అవగాహాన కల్పిస్తున్నట్లు తెలియ చేశారు. ఈ కార్యక్రమాలలో బ్యాంకులు, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, అధికారులు పాల్గొనడం జరుగుతున్నా ప్రజలు పాల్గొనడం జరగటం లేదన్నారు. ఈ విషయంలో పారా లీగల్ వాలంటీర్లు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు ముఖ్యం గా మారుమూల ప్రాంతాల్లో వారికి ప్రభుత్వ రంగాల్లో అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. పోస్టల్, బ్యాంకులు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలను , ప్రజారోగ్య రంగంలో ఉన్న మున్సిపాల్, వైద్య ఆరోగ్య శాఖ, ఆధ్వర్యంలో అందచేస్తున్న సేవలు, హక్కుల పై అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. పబ్లిక్,  ప్రైవేటు రోజువారి ప్రజలకు అందిస్తున్న నిర్వాహణ శాఖ, తపాలా శాఖ, విద్యుత్, పిడబ్ల్యుడి డిపార్ట్మెంట్, ప్రజారోగ్యం పారిశుద్యం, వైద్య సేవలు, రైల్వే, భీమా, వ్యాపారం,రవాణా, లైటింగ్ సౌకర్యాలు,  ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకర్స్, హౌసింగ్, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి శాఖల ద్వారా చేపట్టి ప్రజా ప్రయోజనాలు కొరకు అమలు చేస్తున్న  కార్యక్రమాలన్నీ  న్యాయపరంగా వినియోగ దారులకు ప్రజాప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఉండాలని వాటిపై పూర్తి అవగాహన ప్రజలకు కల్పించాలన్నారు. ఏ ఒక్కరికైనా న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైతే వారు పబ్లిక్ యుటిలిటీ సర్వీసు నందు నమోదు చేసుకుని  వారి సమస్యను న్యాయ పరంగా పరిష్కరించుకునేందుకు  అవకాశం ఉందని ఆ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సాధారణ ప్రజలకు సామాజిక న్యాయం కోసం పారా లీగల్ బృందాలు విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యాలని పేర్కొన్నారు. పారా లీగల్ వాలంటర్ల కోసం, శాశ్వత లోక్ అదాలత్ బృందాలకి సంస్థాగత నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి లక్ష్యం గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారి ఆదేశాల మేరకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్నట్లు తెలిపారు. సార్వజనిక సేవలు,  వీటిని ప్రజలకు అందించే ప్రయత్నం లో ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్లడంలో పారా లీగల్ బృందాల విధులు బాధ్యతలు పై అవగాహాన కల్పించడం కోసం ఈ శిక్షణా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి  పారా లీగల్ వాలంటీర్లు, పర్మినెంట్ లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *