-ఇందుకోసం ఇప్పటికే గుర్తించిన 700 మంది సచివాలయం సిబ్బంది
-ఆసక్తి కలిగిన వారు నేరుగా సిపివో కు దరఖాస్తు చేసుకునే అవకాశం
-పనితీరు, బాధ్యతల నిర్వహణ ఆధారంగా ఎంపిక
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రాధాన్యత అంశాలను గుర్తించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ను జిల్లా స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో అమలు చెయ్యాడానికి ఐదు మంది చొప్పున సచివాలయ సిబ్బంది నియమించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలోని మెరుగైన పనితీరు కలిగిన 700 మంది సిబ్బందిని రాష్ట్ర స్థాయిలో గుర్తించడం జరిగిందన్నారు. ఆయా వివరాలను మండల ప్రజా అభివృద్ధి అధికారులకి తెలియ జేయడం జరిగిందన్నారు. ఆయా జాబితా ఆధారంగా ప్రాధాన్యత కార్యక్రమాలు జిల్లా అభివృద్ధి మరింత సమర్థవంతంగా చేపట్టి దిశలో ఆసక్తి చూపించిన సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లా కేంద్రం గా 5 మంది , నియోజక వర్గ స్థాయిలో ఐదు మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 15 మంది ముందుకు రావడం జరిగిందని, మొత్తం దరఖాస్తులను పరిశీలించి విధులను కేటాయించనున్నట్లు తెలియ చేశారు. ఇప్పటికే గుర్తించిన 700 మంది సిబ్బంది ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన సచివాలయ సిబ్బంది నేరుగా సిపివో కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. నియోజక వర్గ అభివృద్ధి సూచికలు ఆధారంగానే క్షేత్ర స్థాయిలో సిబ్బంది విధులను బాధ్యతలని చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
జిల్లా నోడల్ అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సాంకేతిక పరమైన అంశాలపై జిల్లా అభివృద్ధి అధికారి వ్యవహరిస్తారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆయా సిబ్బంది ఆసక్తి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు చేయడం లో నిబద్ధతను పరిశీలించే విధానం లో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఏప్రియల్ మొదటి వారం చివరి వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News