గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
2024-25 ఆర్దిక సంవత్సరానికి రూ. 152 కోట్లు ఆస్తి పన్నువసూళ్ళు చేయుట ద్వారా గత ఏడాది కంటే రూ.32 కోట్లు అధికంగా వసూలు చేయుట జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్ను వడ్డీ పై రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 25న ప్రకటించిన 50 శాతం రాయితీని వినియోగించుకొని గుంటూరు నగరంలో చివరి రోజైన సోమవారం రూ.6.10 కోట్లతో కలిపి మొత్తం రూ. 26.10 కోట్లు పన్ను నగర ప్రజలు చెల్లించారన్నారు. పన్నులు సకాలంలో చెల్లించుట ద్వారా నగర ప్రజలు నగరాభివ్రుద్దిలో భాగస్వాములయ్యారన్నారు. పన్ను వసూళ్ళలో కృషి చేసిన అడ్మిన్ కార్యదర్శులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులు, డిప్యుటీ కమీషనర్లు ప్రణాళికాబద్దంగా జరిగేలా పర్యవేక్షణ చేసిన అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News