Breaking News

పోలీసుల్లో మానసిక ఒత్తిడులను తగ్గించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలు దోహదపతాయి… : కమాండెంట్ శంకర రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఏపీ సెక్రటేరియట్ లో ఎస్పిఎఫ్ పోలీసులకు ఆటల పోటీల నిర్వహించారు. ఎపిఎస్ఫిఎఫ్ డిజి డాక్టర్ సియం త్రివిక్రమ్ వర్మ మరియు ఐజి బి వి రామిరెడ్డిల సూచనలు మేరకు విజయవాడ జోన్ కమాన్ డెంట్ ముద్దాడ శంకర రావు గారి ఆధ్వర్యంలో ఏపి సెక్రటేరియట్ CSO పి. వి. ఎస్. ఎన్.మల్లికార్జున రావు వారి పర్యవేక్షణలో ఏపి సెక్రటేరియట్ లో గత రెండు రోజులుగా వాలీబాల్ మరియు బాడ్మింటన్ ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కమాండంట్ ముద్దాడ శంకర రావు మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడితో ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఈ ఆటల పోటీల వల్ల వారు శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు.తద్వారా దైనందిన జీవితంలో మానసిక,శారీరక ఒత్తిడులకు అతీతంగా విధులు నిర్వహించగలుగు తారని పేర్కొన్నారు.అంతేగాక మరింత శారీరక దృఢత్వాన్ని పెంపొందించు కునేందుకు క్రీడలు అన్ని విధాలా దోహదం చేస్తాయని కమాండెంట్ శంకర రావు పేర్కొన్నారు.

విజయవాడ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ ఆటలు పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లుకు,విజేతలకు విజయవాడ జోన్ కమాండంట్ ముద్దాడ శంకర రావు ట్రోఫీలు,మెడల్స్,మెమెంటోలు, సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ ఆటల పోటీలను విజయవంతంగా నిర్వహించిన CSO పి. వి. ఎస్. ఎన్.మల్లికార్జున రావు ఇన్స్పెక్టర్స్ మల్లవరపు. వెంకటేశ్వర్లు,సింగూరు రమణ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమానికి డా.అగర్వాల్ కంటి ఆసుపత్రి మేనేజర్ M.రమణ, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *